మనవార్తలు, పటాన్ చెరు :
భోగి పండుగను పురస్కరించుకొని సంగారెడ్డి శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో వేదాస్ సంగారెడ్డి జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. వేదాస్ వారి ఆహ్వానం మేరకు శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్ చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ మరియు టిఆర్ఎస్ పటాన్ చెరు సర్కిల్ 22 బీసీ సెల్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి చారి, వేదాస్ జిల్లా అధ్యక్షులు కె మోహనప్ప చారి,కార్యదర్శి వి రమేశ్ చారి,రాష్ట్ర కోశాధికారి వి నరసింహాచారి,రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వి సాయి చారి, యం రమేశ్ చారీ, సిహెచ్ విజయ భాస్కర్ చారి,కె రాఘవులు చారి,సుదర్శన్ చారి వీరన్న చారి తదితరులు పాల్గొన్నారు.