మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక 20 24 సంవత్సర క్యాలెండర్ ను తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు భేరీ రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్, గుల్ మోహర్ కాలనీ అధ్యక్షులు ఖాసీం సార్ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షులు తెల్ల హరికృష్ణ పాల్గొని తన సందేశంలో తెలంగాణ మొత్తం రాష్ట్రంలో బీసీ ఐక్యవేదిక జేఏసీ విస్తరించి ఐకమత్యం ద్వారా ఒకే గొడుగు కిందికి తీసుకొని రావాలని కోరారు. జాతీయ అధ్యక్షులు కస్తూరి గోపాల కృష్ణ జిల్లాల వ్యాప్తంగా కమిటీలు వేసి మనం బీసీల కొరకు పని చేద్దామని తెలిపారు బీసీ వికాస సమితి అధ్యక్షులు నర్సింగరావు మాట్లాడుతు ఐకమత్యమే మహాబలం రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం బీసీ లందరూ తప్పక పోటీ చేసి రాజ్యాధికారం వైపు దూసుకుపోవాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. జనగణన, కుల గణన చేయాలనీ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.రాబోయే ఎంపీ ఎలక్షన్లో అన్ని పార్టీలు బీసీలకు 30 నుండి 50 శాతం వరకు సీట్లు కేటాయించాలని కోరారు. ఎంపీ ఎలక్షన్ల తర్వాత బీసీ రథయాత్ర చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా బీసీలను కలిసి అన్ని కుల సంఘాలను కలుపుకొని జేఏసీ ద్వారా రాజ్యాధికారం వైపు తీసుకెళ్లటానికి ప్రయత్నం చేస్తామని. అగ్రవర్ణాలు మనకు అధికారం అప్పగించరు మనమే ఏకమై మన ఓటు మనకు నినాదంతో రాజ్యాధికారం సాధిద్దామని బీసీ సంఘాలకు పిలుపునిచ్చారు. బీసీ జేఏసీ తో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరు కలుపుకొని రాజ్యాధికారం వైపు దూసుకెళ్తామని భేరీ రామచందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో వికాస్ నర్సింగరావు, మధుకరాచారి, ఆర్కే సాయన్న, ఎస్సీ జేఏసీ అధ్యక్షులు నరసింహ, వెంకటేశ్వరరావు సార్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు హరికృష్ణ, కుమార్ యాదవ్, మధు యాదవ్ కార్యకర్తలు పాల్గొన్నారు.
