గీతమ్ లో రీసెర్చ్ స్పేస్ ప్రారంభం

Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ (జీఎస్ టి)లోని ఇంజనీరింగ్ విభాగాల మధ్య ఆవిష్కరణలు, సహకారాన్ని పెంపొందించడానికి నెలకొల్పిన రీసెర్స్ స్పేస్ ను జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) జనరల్ మేనేజర్ (పరిశోధన-అభివృద్ధి) ఎస్.కె. చౌరాసియా లాంఛనంగా ప్రారంభించారు.ఇది మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్, ఈఈసీఈ, సీఎస్ఈ విభాగాలకు ఉమ్మడి కేంద్రంగా పనిచేస్తుందని, ఆవిష్కరణ, పరిశోధనా నై పుణ్యాన్ని పెంచడానికి ఉపకరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతికను అందిపుచ్చుకుని మంచి ఆవిష్కరణలు చేయడానికి దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆధ్యాపకులు, పరిశోధక విద్యార్థులకు చౌరాసియా సూచించారు. ఈ అధునాత రీసెర్చ్ స్పేస్లో ఇరవె అత్యాధునిక కంప్యూటర్లను నెలకొల్పామని, ఒక్కొక్కటీ 13వ తరం ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్లతో 4.5 గిగాహెడ్జ్ సామర్థ్యం, 8 జీబీ రామ్ పనిచేస్తాయని, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరక్టర్ కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ ని, రామశాస్త్రి వివరించారు. వినూత్న పరిశోధన, ఆచరణాత్మక అభ్యాసం ద్వారా ఇంజనీరింగ్ జ్ఞానం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఈ రీసెర్చ్ స్పేస్ ను అంకితం చేస్తున్నట్లు ఆయన చెప్పారు.ఈ ప్రారంభోత్సవంలో పలు విభాగాల అధిపతులు, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *