కాప్రా, మనవార్తలు ప్రతినిధి :
కాప్రా డివిజన్ లక్ష్మి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ నీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా కాలనీ లో నివాసం ఉంటున్న ప్రజలు ఎమ్మెల్యే కి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపి శాలువా తో సత్కరించారు. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సౌకర్యం కూడా కల్పించాలని ఎమ్మెల్యేకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తప్పకుండా డ్రైనేజ్, మంచి నీటి వసతి కల్పిస్తాం అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు బైరీ నవీన్ గౌడ్ , మైనార్టీ సెల్ ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జి బద్రుద్దిన్ , మల్లారెడ్డి, కాలనీ ప్రెసిడెంట్ బాబు యాదవ్ పోతుల, ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాస్, వైస్ ప్రెసడెంట్ s కిరణ్, మల్లెల వెంకటేశ్వర్లు, సి.హెచ్ శివ రామకృష్ణ , రావుల కరుణాకర్ గౌడ్, బండి రాజు, దొలికి సాయికృష్ణ, నర్సింగ్ రావు, బండి రామకృష్ణ గౌడ్, మల్లెల ఉమ రాణి , సి. హెచ్ గాయత్రి , సుధా రాణి పొతుల, బండి మౌనిక, దొలికి మనీషా, సుప్రియ , సంధ్య తదితరులు పాల్గొన్నారు..