వార్షిక న్యూస్ టర్ ‘ప్రమోషన్’ ఆవిష్కరణ…

Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హెదరాబాద్ లోని మార్కెటింగ్ క్లబ్ మంగళవారం వార్షిక న్యూస్లెటర్ ‘ప్రమోషన్’ (అన్వేషించు, నేర్చుకో, ఎదుగు)ను ప్రారంభించింది. బీ-స్కూల్ అధిపతి ప్రొఫెసర్ వినయ్ కుమార్ అప్పరాజు ఈ న్యూస్లెటర్ను ఆవిష్కరించారు. ఆయనతో పాటు ప్రొఫెసర్ కరుణాకర్.బి, ప్రొఫెసర్ దేవీప్రసాద్, ప్రొఫెసర్ పినాకపాణి పేరి, డాక్టర్ నేనురాజు సుధ తదితరులు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన ప్రమోషన్ కమిటీని ప్రకటించారు.ఈ వార్షిక న్యూస్లెటర్ను వెలువరించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని ప్రొఫెసర్ వినయ్ కుమార్ అభినందించారు. కొత్త బృందం మంచి ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు.

మార్కెటింగ్ క్లబ్ హెడ్ (2021-23 బ్యాచ్) శ్రీవాణి తమ రెండేళ్ల ప్రయాణాన్ని వివరించారు. ప్రమోషన్ నూతన అధిపతి శివాంజలి శివకుమార్ మాట్లాడుతూ, తమ ప్రాథమిక లక్ష్యం సహకారం, ఆవిష్కరణ, శ్రేష్ఠత సంస్కృ తిన పెంపొందించడమని చెప్పారు. అలాగే తమ భవిష్యత్తు ప్రణాళికను వివరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన రెండు వీడియోలు (సీనియర్ల సంతోషకరమైన ప్రయాణం, న్యూస్లెటర్ ఆవిష్కరణలో జూనియర్ల కృషి) అందరి మన్ననలను చూరగొన్నాయి.ఈ కార్యక్రమంలో బీ-స్కూల్కు చెందిన పలువురు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *