నాగార్జున ఉన్నత పాఠశాలలో మహిళలకు స్వయం ఉపాధి కోసం ఉచిత టైలరింగ్ కార్యక్రమం ప్రారంభోత్సవం

politics Telangana

మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి :

రాయదుర్గం, దర్గా, మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎ. భరత్ కుమార్ గౌడ్ గచ్చిబౌలి డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ సహకారంతో మహిళలందరి కోసం స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకొని తమకాలపై తాము నిలబడేటట్లుగా ఒక చక్కని అవకాశం కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం బుధవారం రోజు పాఠశాల ఆవరణలో ప్రారంభోత్సవానికి విచ్చేసిన మహిళలందరూ తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదర్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సంధ్యా రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా.ఆమె మాట్లాడుతు మహిళల కోసం ఇంతటి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు తాను కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. మహిళలందరికీ ఇది ఒక్క గొప్ప అవకాశం అని చెప్పారు. ఈ ట్రైనింగ్ కి 13 రకాలుగా ఉపయోగపడే కావలసిన సామాగ్రి (మెటీరియల్) అంతా కూడా ఏ .భరత్ కుమార్ గౌడ్ గారు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి 200 పైగా మహిళలు విచ్చేసి తమ పేర్లు నమోదు చేసుకోవడానికి ముందుకు వచ్చారు. ఇంకా ఎంతోమంది ముందుకు రావడానికి కూడా ఆసక్తి చూపుతున్నారని భరత్ కుమార్ తెలిపారు.ఇలాంటి కార్యక్రమం నానక్ రామ్ గూడ లో కూడా ప్రారంభం చేస్తామని చెప్పారు .ఇలాంటి అవకాశం మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకొని వారి ఉపాధిని కల్పించుకోవాలనీ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *