బీరంగూడ చౌరస్తాలో అంగరంగ వైభవంగా విశ్వగురు మహాత్మ బసవేశ్వరుడి 12 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ

politics Telangana

_విశ్వగురు మహాత్మా బసవేశ్వరుడి బోధనలు స్ఫూర్తిదాయకం

_లింగాయత్ లను ఓబీసీ లో చేర్చేందుకు కృషి
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

_బీరంగూడ శివాలయం గుట్టపై వీరశైవ లింగాయత్ కులస్తుల కోసం వెయ్యి గజాల స్థలం కేటాయింపు, భవన నిర్మాణానికి సహకారం

_30 లక్షల రూపాయల సొంత నిధులతో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

రామచంద్రాపురం,మనవార్తలు ప్రతినిధి :

సమాజంలో కులం, మతం, వర్ణం, లింగ విభేదాలు లేవని, అందరూ ఒకటేనని 12వ శతాబ్దంలోనే విశ్వ వ్యాప్తంగా చాటి చెప్పిన మహనీయుడు విశ్వగురు మహాత్మ బసవేశ్వరుడని, ఆయన స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిలు ఉన్నారు.రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని బీరంగూడ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన 12 అడుగుల మహాత్మా అశ్వారుడ బసవేశ్వరుడి కాంస్య విగ్రహాన్ని ఆదివారం ఉదయం మెదక్ ఎంపీ కేపిఆర్, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. వీరశైవ లింగాయత సమాజం విజ్ఞప్తి మేరకు 30 లక్షల రూపాయల సొంత నిధులతో ఎమ్మెల్యే జిఎంఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. 12వ శతాబ్దంలోని కులరహిత సమాజం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి మహాత్మ బసవేశ్వరుడు అని కొనియాడారు. సమ సమాజ స్థాపనకై దేవుడిని భక్తుడి వద్దకు తీసుకువచ్చే ఇష్ట లింగ పూజ కార్యక్రమాన్ని తీసుకువచ్చారని తెలిపారు. బసవేశ్వరుడు బోదనలు నేటి సమాజానికి ఎంతో అవసరమని అన్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బసవేశ్వరుడి జయంతిని అధికారికంగా నిర్వహించడంతోపాటు ట్యాంకు బండ్ పైన ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. దీంతోపాటు కోకాపేటలో వీరశైవ లింగాయతుల కోసం ఎకరా స్థలం కేటాయించి భవనాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలన రంగంలోనూ లింగాయత్ కులస్తులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తగు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.

పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో శ్రీ పురుషుల మధ్య లింగ విభేదాలను తొలగించడానికి కృషిచేసిన గొప్ప అభ్యుదయవాది బసవేశ్వరుడని కొనియాడారు. కులాలు, మూఢనమ్మకాలు, స్వార్థపరుల సృష్టి అంటూ వాటిపై సమరభేరి మోగించారన్నారు. సర్వ మానవ సమానత్వమే శాంతికి మూలమని బసవేశ్వరుడు ఉపదేశించారని తెలిపారు. ఆయన సూచించిన మార్గంలోనే.. పటాన్చెరు నియోజకవర్గంలో సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. భవిష్యత్ తరాలకు ఆయన చూపిన మార్గం తెలియజేయాలన్న లక్ష్యంతోనే 30 లక్షల రూపాయల సొంత నిధులతో జాతీయ రహదారి పక్కన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.దీంతోపాటు బీరంగూడ గుట్టపైన వెయ్యి గజాల స్థలాన్ని వీరశైవ లింగాయత్ కులస్తుల కేటాయించి భవన నిర్మాణానికి సహకారం అందించబోతున్నట్లు ప్రకటించారు.అనునిత్యం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, బీసీ కమిషన్ సభ్యులు శుభ ప్రద పటేల్, పీఠాధిపతులు ప్రసంగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *