పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ సెన్స్, గణిత శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ కృష్ణ, కుమ్మరి, భారత జాతీయ సెన్స్ అకాడమీ (ఐఎన్ఎస్) విజిటింగ్ సెంటిస్ట్ ప్రోగ్రాము ఎంపికయ్యారు. ఈ విషయాన్నిఆ విభాగాధిపతి డాక్టర్ మోతహర్ రెజా శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఐఎన్ఎస్పీ మార్గదర్శకాల ప్రకారం, ఫెలోషిప్ అనేది అధునాతన పరిశోధనలు, లేదా భారతీయ పరిశోధనా సంస్థలు/ప్రయోగశాలల్లో ప్రత్యేక శిక్షణ పొందడం కోసం ఉద్దేశించినదన్నారు. ఈ ఆవార్డు పొందిన వ్యక్తి మనదేశంలోని ఏదేని ప్రయోగశాల లేదా పరిశోధనా సంస్థలో కనీసం ఒక నెల నుంచి గరిష్టంగా ఆరు నెలల వరకు గడపవలసి ఉంటుందని తెలిపారు. అవార్డు గ్రహీతలకు ప్రయాణ ఖర్చులతో పాటు నెలకు 30 వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తారన్నారు. ఐఎన్ఎస్పి విజిటింగ్ ఫెలోషిప్ పొందిన డాక్టర్ కృష్ణను సహ అధ్యాపకులు పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.