_మన ఊరు మన బడి ద్వారా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి :
ప్రభుత్వ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు మనబడి పథకం ద్వారా పోటీ పది లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టారు అభివృద్ధి పనులకు బుధవారం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన ఊరు మనబడి పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అత్యాధునిక మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కోటి పది లక్షల రూపాయలతో పనులు ప్రారంభించామని మరో కోటి రూపాయలు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 55 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.
అనంతరం గ్రామంలోని మల్లికార్జున స్వామి దేవాలయం జీర్ణోధారణ పనులకు శంకుస్థాపన నిర్వహించారు.పటేల్ గూడ గ్రామ పరిధిలోని హరివిల్లు టౌన్షిప్లో హనుమాన్ దేవాలయం నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమాల్లో జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ దేవానందం, గ్రామ సర్పంచ్ కృష్ణ, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, ఐలాపూర్ సర్పంచ్ మల్లేష్, పటేల్ గూడ సర్పంచ్ నితీశా శ్రీకాంత్, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజు, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.