ఎమ్మిగనూర్,మక్బుల్ బాషా,మనవార్తలు ప్రతినిధి :
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో వారం రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలకు శివారు కాలనీ రోడ్లు చిత్తడి గా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలు అధికారులు, స్థానిక నాయకులకు, ఎమ్మెల్యే కు చెప్పిన పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని శివారు కాలనీ లు మైనారిటీ కాలనీ, శివన్న నగర్, మిలిటరీ కాలనీ, మహబూబ్ నగర్ కాలనీలలో వారం రోజులు గా కురుస్తున్న వర్షాలకు తాగు నీటి పైపు లైన్ పగిలి నీరు ఎర్రగా వస్తున్నాయని, ఆ నీటిని తాగి రోగాలు వస్తున్నాయని ,మట్టి రోడ్లు చిత్తడి గా మారడం తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సమస్యలపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన ఎవరు పట్టించు కొరని, ఓటు వేయించుకుని గెలిచిన ఎమ్మెల్యే తమ సమస్యలు పట్టించు కోవడం లేదని వాపోయారు.