గీతం ఆర్థిక శాస్త్ర అధ్యాపకులకు ఇన్ చార్జి వీసీ ప్రొఫెసర్ గౌతమరావు సూచన
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతమలో ఆర్థిక శాస్త్రం బోధిస్తున్న అధ్యాపకులు తమ బోధన, పరిశోధన నైపుణ్యాలను మరింత మెరుగు పరచుకుని సమీప భవిష్యత్తులో మంచి ఫలితాలను సాధించాలని గీతం ఉప కులపతి (ఇన్ఛార్జ్) ప్రొఫెసర్ వై.గౌతమరావు సూచించారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ స్ ఆధ్వర్యంలో ‘బోధనా శాస్త్రం, పరిశోధనా నైపుణ్యాలను పెంచడం: ఎకనామెట్రిక్ విశ్లేషణలో ఆర్ యొక్క ఉపయోగం’ అనే అంశంపై ఈనెల 18-20వ తేదీ వరకు నిర్వహించనున్న అధ్యాపక వికాస కార్యక్రమాన్ని (ఎఫ్ డీపీ) బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఎకనామెట్రిక్ విశ్లేషణలో ఆర్ యొక్క ఉపయోగంపై దృష్టి సారించి బోధన, పరిశోధనలో అధ్యాపకుల నైపుణ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు.గీతం మూడు ప్రాంగణాలలోని ఆర్థిక శాస్త్ర అధ్యాపకులు కలిసి పనిచేయాల్సిన అశ్యకతను ఈ సందర్భంగా వీసీ నొక్కి చెప్పారు. ఈ మూడు రోజుల ముఖాముఖి కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని అధ్యాపకులను ఆయన ప్రోత్సహించారు. ఈ అధ్యాపక వికాస కార్యక్రమ ప్రభావం, అంతిమంగా అధ్యాపకుల బోధన, పరిశోధనా కార్యకలాపాలలో ఎంత మేరకు జ్ఞానాన్ని పొందుతారనే దానిపై ఆధారపడి ఉంటుందని ప్రొఫెసర్ గౌతమరావు అన్నారు.
ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు సూచించారు.గీతం మూడు ప్రాంగణాలలో సాంఘిక శాస్త్ర సమస్యలను పరిష్కరించడానికి సంయుక్త సహకార ప్రయత్నాల అవసరాన్ని జీఎస్ హెచ్ఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి.సన్నీ జోష్, ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుత విద్యా ధోరణులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకోవడంపె దృష్టి పెట్టాలని ఆయన అధ్యాపకులను కోరారు. రానున్న రెండు మూడేళ్లలో అత్యుత్తను పరిశోధనా పత్రాలను ప్రచురించడంతో పాటు పరిశోధన కోసం పెద్ద మొత్తంలో నిధులను పొందే లక్ష్యంతో పరిశోధనా ఎజెండాను అభివృద్ధి చేయాలని ఆయన ఆకాంక్షించారు.ఈ మూడు రోజుల ఎఫ్ డీ పీకి బిట్స్ హైదరాబాద్ లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ. భీమేశ్వర్రెడ్డి ప్రధాన వక్తగా వ్యవహరించనున్నారు. ఎకనామెట్రిక్స్ లో ఆర్ యొక్క వినియోగం ద్వారా ఈ ఎఫ్ డీ లో పాల్గొనేవారికి మార్గనిర్దేశనం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని జీఎస్ఏహెచ్ఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నెల్సన్ మండేలా షణ్ముగం సమన్వయం చేశారు. శుక్రవారం వరకు ఈ కార్యక్రమం కొనసాగనున్నది.