పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్లోని మానసికశాస్త్ర (సెక్షాలజీ) విభాగం ఆధ్వర్యంలో “ఎలా ఉన్నారు” (హౌ ఆర్ యూ)) పేరుతో ఆకర్షణీయమైన స్కిట్న ప్రదర్శించారు. కళలు, ప్రదర్శనల విభాగం సహకారంతో నిర్వహించిన ఈ స్కిట్లో మాటలే లేకుండా భావాలను, భావోద్వేగాలను, మానసిక స్థితి, మెదడుపై వాటి ప్రభావాలను చూపేలా సాగింది.అసిస్టెంట్ ప్రొఫెసర్ రమిత్ రమేష్ నూర్గదర్శనంలో ప్రతిభావంతులైన ఎం. సాయిస్పందన, ఐషాని, ఆధ్యా: రాకేష్, యామినీ పద్మప్రియ, గ్రీసు, పవన్ శశాంక్ కశ్యప్, నిర్మా చౌదరి ఈ అపూర్వ ప్రదర్శనను రూపొందించారు.డివెజ్డ్ థియేటర్ అనేది ఒక సహకార ప్రక్రియ. ఇది సమిష్టి ప్రదర్శనను సృష్టిస్తుంది.



భాగస్వాన్యు పద్ధతుల ద్వారా సమిష్టి ప్రయోగాలు, కదలికలను మెరుగుపరచడం ద్వారా ఒకదానికొకటి జోడించబడిన అనుభూతిని సృష్టించి, ప్రేక్షకులు వాటికి సొంత అర్థాన్ని అన్వయించుకునేలా చేస్తుంది.ప్రేమ, దుఖం, నష్టం, పెరుగుదల, మార్పును అంగీకరించడం, విభిన్న వ్యక్తులతో శాంతిని పొందడం, ప్రేక్షకులు కళాకారుల మధ్య సరిహద్దులను చెరిపివేయడమే లక్ష్యంగా ‘ఎలా ఉన్నారు’ ప్రదర్శన సాగి, కళ అనేది జీవితానికి ప్రతిబింబం అని గుర్తుచేసింది.గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు, ఆంగ్ల విభాగాధిపతి ప్రొఫెసర్ డీఆర్ చంద్రశేఖర్, సెక్షాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ దుర్గేష్ నందినీ, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు ఈ స్కిలను తిలకించి, ప్రదర్శకులను అభినందించారు.
