అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
అమీన్పూర్
అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో చెరువు కట్ట వద్ద నిర్వహించిన దుర్గామాత నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు.
నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ టి పి ఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ నందారం నరసింహ గౌడ్, కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.