అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేదే లేదు ….

Hyderabad

అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేదే లేదు ….
– అధికారులు అడ్డుకోబోయిన నాయకులు

హైదరాబాద్ :

శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని కొండాపూర్ డివిజన్ లో గల మార్తాoడ నగర్ లో నిర్మాణం పూర్తయిన అక్రమ నిర్మాణాలను, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ ల లో రెండు, మూడు, నాలుగు స్లాబ్ లు, గోడలను జేసీబీ, గ్యాస్ కట్టర్లత్ కూల్చి వేశారు. జి.హెచ్.ఎం.సి, అధికారులు రామచంద్రాపురం ఏసీపీ, స్వామి నాయక్, శేరిలింగంపల్లి ఏసీపీ స్వప్న రెడ్డి, సెక్షన్ ఆఫీసర్ లు విశాల్, రమేష్ ల సమక్షంలో కూల్చివేశారు.

కూల్చివేతల్లో తమ విధులకు అడ్డురాకుడదని పోలీస్ బందోబస్తు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను ఉపేక్షించేది లేదని అధికారులు తెలిపారు.

కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండనగర్ లో అక్రమంగా కులుస్తున్న బిల్డింగ్ పనులు ఆపివేయలని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ల తో మాట్లాడారు. పేదప్రజాలు ఎన్నో ఆశలతో కట్టుకుంటున్న ఇండ్లపై దౌర్జన్యంగా కూలగొట్టడం సరికాదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కూల్చివేతల విషయం తెలుసుకున్న స్థానిక తెరాస, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పెరుక రమేష్, మహిపాల్ యాదవ్, మారబోయిన రఘునాథ్ యాదవ్ లు ఘటనా స్థలానికి చేరుకుని ఇన్నాళ్లు చూస్తూ ఊరుకొని నిర్మాణాలు పూర్తయ్యే సమయానికి ఇలా దారుణంగా కూల్చడం సరికాదని అన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారమే తాము చర్యలు తీసుకుంటామని అధికారులు వివరణ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *