అక్రమంగా నిర్వహిస్తున్న కల్లు దుకాణాలను మూసివేయాలి

politics Telangana

– గ్రామస్తులు నగేష్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, రాములు గౌడ్

– రెండు కల్లు దుకాణాలకే అనుమతులు అక్రమంగా వెలిసిన ఐదు దుకాణాలు

– చెప్పిన పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

రెండు దుకాణాలకే అనుమతులు ఉన్నప్పటికీ మరో ఐదు దుకాణాలలో కల్లు అక్రమంగా విక్రయిస్తున్నారని గ్రామస్తులు నాగేష్ గౌడ్, రాములు, ఆంజనేయులు గౌడ్ లు ఆరోపించారు. మంగళవారం మండలంలోని భానుర్ గ్రామంలో వారు మీడియాతో మాట్లాడుతు గ్రామంలో రెండు కల్లు దుకాణాలకు మాత్రమే అనుమతులు ఉన్నప్పటికీ గ్రామంలో విచ్చలవిడిగా కల్లు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వపరంగా రెండింటికే అనుమతులు ఉన్న ప్రభు గౌడ్, స్వామి గౌడ్, అనంతయ్య గౌడ్, నారాయణ గౌడ్, గంగయ్య గౌడ్ లు వెంకటేష్ గౌడ్ దగ్గర కల్లులు కొనుగోలు చేస్తూ గ్రామంలో విక్రయిస్తున్నారన్నారు. ఎన్నిసార్లు ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, అసలు మమ్ములను పట్టించుకోవడమే లేదని వారు ఆవేదనను వ్యక్తం చేశారు. దుకాణాలను వేరొక వ్యక్తి తమ గ్రామంలో కల్లు దుకాణాలను నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతూ మా పొట్ట కొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, వెంటనే అక్రమంగా నిర్వహిస్తున్న దుకాణాలను మూసివేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *