_తూతూ మంత్రంగా అక్రమ కట్టడం కూల్చివేత
– బిల్డర్లకు అండగా నిలుస్తున్న రాజకీయ నాయకులు
–
మనవార్తలు ,పటాన్‌చెరు:
సంగారెడ్డి జిల్లా లో అక్రమ కట్టడాలు యథేచ్ఛగా సాగుతున్నాయి . రాజధాని హైదరాబాద్ కు అతి దగ్గరలో ఉండడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇళ్ళు ,భవనాలు ,షెడ్లను అక్రమంగా నిర్మిస్తున్నారు. అధికారులు సైతం తూతూమంత్రంగా కొన్ని అక్రమ నిర్మాణాలను, కట్టడాలను కూల్చివేసి చేతులు దులుపుకుంటున్నారు.వివరాల్లోకి వెళ్తే అక్రమ కట్టడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అక్రమ కట్టడాలను నిలువరించాల్సిన క్షేత్రస్థాయి అధికారులకు రాజకీయ నాయకుల ఒత్తిళ్లు అధికమవడంతో చేసేదేమి లేక చేతులెత్తేస్తున్నారు.
జిల్లా అధికార యంత్రాంగం అక్రమ కట్టడాలపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు ఒక న్యాయం. పెద్దలకు ఒక న్యాయామా అని బాహాటంగా ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఎక్కడో కాదు పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశంలో జరుగుతున్న అక్రమ కట్టడాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పటాన్‌చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శనివారం కూల్చివేతలు జరిగాయి. ఈ కూల్చివేతలు కూడా నామమాత్రంగా జరిగాయి. ఇంద్రేశం పంచాయతీ కార్యదర్శి సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం ఇంద్రేశం గ్రామ పరిధిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన సమాచారం మేరకు కూల్చివేతలు జరిపినట్టు తెలిపారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేతలు తప్పవని ఆయన హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని చెప్పారు. కొనుగొలుదారులు కూడా ప్రభుత్వ నిబంధనలతో నిర్మించిన అపార్ట్మెంట్ లలో ఫ్లాట్లు కొనుగోలు చేయాలని ఆయన సూచించారు.
యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు…
అదేవిధంగా బిల్డర్లకు, అక్రమ నిర్మాణదారులకు స్థానిక ప్రజాప్రతినిధులు అన్ని విధాలుగా అండగా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనితో ప్రభుత్వ పరమైన, అధికారికంగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఏది ఏమైనా ప్రభుత్వ నిబంధనలకు లోబడి అపార్ట్‌మెంట్ నిర్మాణాలు చేపట్టి అటు వినియోగదారులకు, ఇటు కొనుగోలు చేసే వ్యక్తులకు అన్ని విధాలుగా సేఫ్ సైడ్ లో ఉంటుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఈ అక్రమ నిర్మాణాలను జిల్లా అధికారులు ఏ మేరకు నియంత్రిస్తారో వేచి చూడాల్సిందే.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…