మనవార్తలు ,రామచంద్రపురం:
ప్రజలందరి ప్రాణాలను కాపాడటానికి, ప్రజల ఆరోగ్యాలను ఎల్లప్పుడూ కాపాడేందుకు ఎంతగానో శ్రమించే హీరోలే వైద్యులు అని ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ అన్నారు. డాక్టర్స్ డే సందర్భంగ రామచంద్రాపురం ఈఎస్ఐ హాస్పిటల్ మరియు ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్యులందరికి అందరికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు .అనంతరం వైద్య సిబ్బందిని పూలమాల వేసి శాలువతో ఘనంగా సన్మానించారు .
ఈ సంధర్బంగా ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ మాట్లాడుతూ వైద్యో నారాయణ హరి అంటారు దేవుడు మనకు జన్మనిస్తే ,వైద్యుడు పునర్జన్మనిస్తాడు ప్రస్తుతం దేశాన్ని అల్లోకాల్లోలం చేసిన కరోనా పరిస్థితుల్లో వైద్యులే పోరాటం చేసి ఎందరో ప్రాణాలను కాపాడారు ,రోగి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు తమ ప్రాణాలను కుడా లెక్కచేయరని అందుకే ప్రతి సంవత్సరం జులై 1న డాక్టర్స్ డేగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందో అని ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ తెలిపారు .ఈ కార్యక్రమంలో ఏకె ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్,అబ్దుల్ గఫార్, కృష్ణమూర్తి చారి, శివ కుమార్, అబ్దుల్ సమీ తదితరులు పాల్గొన్నారు.