మనవార్తలు , పటాన్ చెరు:
పాశమైలారం గ్రామంలో నూతనంగా నిర్మించిన మల్లికార్జున స్వామి విగ్రహప్రతిష్ఠాపన , ధ్వజస్తంభం ప్రతిష్టపాన ఘనంగా జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కె సత్యనారాయణ పూజలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.


అనంతరం మాట్లాడుతూ నూతన భ్రమరాంబ మల్లికార్జున స్వామి విగ్రహము మందిరము నిర్మించడం చాలా అదృష్టకరమని, పాశమైలారం గ్రామంలోని ప్రజల మద్దతు చాలా ఉంది అని ఉప సర్పంచ్ మోటే కృష్ణ యాదవ్ కు ఈ పూజలో పాల్గొన్న ఈ మందిర నిర్మాణ కుటుంబ సభ్యులకు మరియు ప్రతి ఒక్కరికి భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆశీస్సులు దీవెనలు ఉండాలని ఆ పరమేశ్వరుడు రూపమైన మల్లికార్జున స్వామిని వేడుకుంటున్నాను అని అన్నారు అనంతరం ఉప సర్పంచ్ మోటే కృష్ణ యాదవ్ సత్యనారాయణను శాలువాతో సన్మానించారు ఈ ప్రతిష్టాపన కార్యక్రమానికి గ్రామస్తులతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
