పటాన్చెరు
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆదివారం పటాన్చెరు మండలం నందిగామ గ్రామంలోని ఆయన విగ్రహానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ సేవలను ఆయన కొనియాడారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల ఆవరణలో గాంధీ మహాత్ముడు విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ ప్రభావితం చేసిన ఏకైక వ్యక్తి మాత్మ గాంధీ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఉమాపతి గోపాల్, ఎంపీటీసీ నాగజ్యోతి లక్ష్మణ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు పాండు, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.