యువతకి ఆదర్శంగా నిలిచిన “విక్టరీ బాయ్స్

Hyderabad politics Telangana

మనవార్తలు ,శేరిలింగంపల్లి:

త‌ల‌సేమియా వ్యాధితో బాధ‌ప‌డుతున్న చిన్నారుల‌కు ప్ర‌తి నెల ర‌క్తం అవ‌స‌రం ఉంటుంద‌ని ప్ర‌తి ఒక్క‌రూ ర‌క్త దానం చేయాలని విక్ట‌రీ బాయ్స్ ప్ర‌తినిధులు కొమ్ముగూరి ప్రదీప్ అన్నారు . రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి లో “మదర్ థెరిస్సా” రక్తదాన కేంద్రంలో విక్టరీ బాయ్స్ యువత రక్తదాన చేశారు . 73 వ గణతంత్ర దినోత్సవంను పుర‌స్క‌రించుకుని ప్రతీ ఏడాదిలాగే ఈసారి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ 8వ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు  చేశామని తెలిపారు .

త‌ల‌సేమియా ప్రాణాంత‌క‌ర వ్యాధి అని ఎంతో మంది చిన్నారులు ఈ వ్యాధితో బాధ‌ప‌డుతున్నార‌ని తెలిపారు. క‌రోనా స‌మ‌యంలో ర‌క్త‌దాత‌లు ర‌క్తం ఇచ్చేందుకు ముందుకు రావ‌డం లేద‌ని ..దీంతో ఎంతో మంది చిన్నారులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని చెప్పారు .ర‌క్త‌దానం చేయ‌డంపై ఉన్న అపోహ‌ల‌ను తొల‌గించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు . యువ‌త స్వ‌చ్చంధంగా ర‌క్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు . కోవిడ్ మహమ్మారి తో పోరాడుతూనే అలాగే ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు . ఈ కార్యక్రమంలో కొమ్ముగూరి ప్రదీప్,పృద్వి రాజ్, జాక్సన్ ,అనిల్ మనీష్ బృందాన్ని రక్తదాన కేంద్ర సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. రక్తదానం చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *