పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ సెన్ట్స్ ని గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మోతహర్ రెజాను ఇంటర్నేషనల్ ఆడ్వాన్స్డ్ కంప్యూటింగ్ కమ్యూనిటీ (ఐఏసీసీ) 2023 సంవత్సరానికి ‘ఉత్తమ పరిశోధకుడి అవార్డుతో సత్కరించింది. ఆధునాతన కంప్యూటింగ్లో డాక్టర్ రాజు పరిశోధన, లోతైన అభ్యాసం, సమాంతర కంప్యూటింగ్కు గుర్తింపుగా ఈ ఆచార్డును ఇచ్చి గౌరవించినట్టు విశ్వవిద్యాలయ వర్గాలు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. హెదరాబాద్ లోని సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఇటీవల జరిగిన 12వ జనిసీపీసదస్సులో తెలంగాణ కార్మిక, ఉపాధి శాఖల మంత్రి చాచుకూర మల్లారెడ్డి, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్ఐఏ)చైర్మన్ ప్రొఫెసర్ కె.కె.అగర్వాల్ చేతుల మీదుగా డాక్టర్ రెజూ ఈ అవార్డును అందుకున్నట్టు తెలిపారు.బిట్స్ పిలానీ నుంచి ఎంటెక్, అంటీ ఖరగ్ పూర్ నుంచి పీహెచ్, జర్మనీలోని ఫ్రెడరిక్ అలెగ్జాండర్ విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్ డాక్ డిగ్రీలను పొందిన డాక్టర్ రెజా గత కొన్నేళ్లుగా వివిధ అప్లికేషన్లలో డీప్ లెర్నింగ్, హెచీసీసీలపై పనిచేస్తున్నట్లు వివరించారు. అధునాతన న్యూమరికల్ టెక్నిక్లను ఉపయోగించి కంప్యూటేషనల్ అప్లైడ్ న్యూథమెటిక్స్ (సీఎల్డీ, బర్బులెన్స్ మోడలింగ్ ) కూడా పరిశోధనలు చేయడంతో పాటు ప్రసిద్ధ ఎసీసీఐ- ఇంటెక్స్ట్ జర్నల్స్ ఆయన పలు పరిశోధనా పత్రాలను ప్రచురించినట్టు తెలియజేశారు. భారత ప్రభుత్వరంగ సంస్థల ఆర్థిక సౌజన్యంతో ఆయన ఈ పరిశోధనలను చేపడుతున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు..