పటాన్చెరు:
20 సంవత్సరాల పిన్న వయసులో కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ద్విచక్ర వాహనంపై ప్రయాణం సాగిస్తూ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని అవగాహన కల్పిస్తున్న హైదరాబాద్ రైడర్ ప్రియ నేటి యువతకు ఆదర్శమని పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణం శాంతి నగర్ కాలనీకి చెందిన ప్రియ స్వతహాగా బైక్ రైడర్. హైదరాబాద్ నుండి కేదార్నాథ్ వరకు సోలో రైడ్ పూర్తిచేసిన మొట్టమొదటి అమ్మాయి ప్రియా. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ వేయించుకోవాలి అంటూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రారంభించిన రైడ్ పటాన్చెరుకు చేరుకుంది. స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శాలువా కప్పి ఆమెకు అభినందనలు తెలిపారు.
ప్రియా సాగిస్తున్న ప్రయాణం నేటి యువతకు ఆదర్శప్రాయమని అన్నారు. పటాన్చెరు నియోజకవర్గం పేరును దేశ స్థాయిలో నిలపడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, వీరా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.