జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో కీర్తిప్రతిష్టలు తెచ్చిన పారా-అథ్లెట్లను ఘనంగా సత్కరించిన హైదరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ శ్రీ సి.వి.ఆనంద్‌

Hyderabad Lifestyle Telangana

_సిమ్లా నుండి మనాలి వరకు జరిగే ఇన్ఫెనిటి రైడ్‌‘‘22లో పాల్గొంటున్న లక్ష్మీ మంచు & రెజీనా కసండ్రా

మనవార్తలు ,హైదరాబాద్:

భారతదేశానికి మరియు ఎఎమ్‌ఎఫ్‌కు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో కీర్తిప్రతిష్టలు తెచ్చిన పారా-అథ్లెట్లను ఘనంగా సత్కరించిన హైదరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌  సి.వి.ఆనంద్‌ ,శారీరక వైకల్యానికి గురైన వ్యక్తులు క్రీడా వృత్తిని ఎంచుకునేలా సహాయం చేయడంతోపాటు వారికి స్వీయ-పోషణను అందిస్తున్న లాభాపేక్ష లేని సంస్థ అయిన ఆదిత్య మెహతా ఫౌండేషన్‌ (ఎఎమ్‌ఎఫ్‌), పారా`అథ్లెట్లు ఎఎమ్‌ఎఫ్‌లో శిక్షణ తీసుకున్న తరువాత జాతీయంగా మరియు అంతర్జాతీయంగా పతకాలను సాధించి తద్వారా దేశానికి కీర్తి ప్రతిష్టలను సంపాదించినవారిని గౌరివించేందుకు ఎఎమ్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో 11వ ఆదిత్య మెహతా ఫౌండేషన్‌ ప్రజెంటేషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌ ఉత్సవం ఈ రోజు జూబ్లీహిల్స్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌, పోలీస్‌ కమీషనర్‌,  సి.వి. ఆనంద్‌ ముఖ్య అతిథిగా హాజరై దేశం మరియు ఎఎమ్‌ఎఫ్‌ను గర్వపడేలా చేసిన పారా`అథ్లెట్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ఎఎమ్‌ఎఫ్‌ మెంటర్‌ & నటి,  లక్ష్మి మంచు; తెలంగాణ మాజీ ముఖ్య కార్యదర్శి & ఎఎమ్‌ఎఫ్‌, ట్రస్టీ  ఎస్‌కె జోషి ; సిఆర్‌పిఎఫ్‌, మాజీ డిజి మరియు ఎఎమ్‌ఎఫ్‌, మెంటర్‌, కె.దుర్గా ప్రసాద్‌ ; ట్రస్టీ ఎఎమ్‌ఎఫ్‌ & బాహుబలి సినిమా నిర్మాత & ఆర్కా మీడియా సిఇఒ, శోభు యార్లగడ్డ; ఎఎమ్‌ఎఫ్‌ ట్రస్టీ & నటి, ఫిలాంత్రపిస్ట్‌, కుమారి రెజీనా కసండ్రా ; ట్రస్టీ ఎఎమ్‌ఎఫ్‌ & మాజీ మిసెస్‌ ఇండియా & ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమతి శిల్పా రెడ్డి లు హాజరైనారు. ఈ సందర్బంగా ఇన్ఫినిటి రైడ్‌‘‘2022 పోస్టర్‌ను ప్రముఖులు ఆవిష్కరించి ఎఎమ్‌ఎఫ్‌ సహకారాన్ని అందుకుంటున్న అథ్లెట్లకు 80 లక్షల రూపాయాలకు పైగా విలువచేసే ఉపకరణాలను పంపిణీ చేశారు.

ఆదిత్య మెహతా ఫౌండేషన్‌ (ఎఎమ్‌ఎఫ్‌) గురించి:

పారా స్పోర్ట్స్‌ ప్రపంచంలో భారత్‌ను సూపర్‌ పవర్‌గా మార్చడమే మా లక్ష్యం. ఆదిత్య మెహతా ఫౌండేషన్‌ (ఎఎమ్‌ఎఫ్‌) అనేది ఒక లాభాపేక్ష లేని సంస్థ, ఇది వైకల్యాలున్న వ్యక్తులకు క్రీడా వృత్తిని కొనసాగించేందుకు సహాయం చేస్తుంది మరియు వారికి స్వీయ-పోషణను అందిస్తుంది. 2013లో ప్రారంభమైన ఈ ఫౌండేషన్‌ అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగింది. హైదరాబాద్‌లో ఉన్న ఈ ఫౌండేషన్‌ వాస్తవంగా దేశంలోని ప్రతి మూలకు విస్తరించి, భారతదేశానికి పతకాలు గెలుస్తున్న పారా ఛాంపియన్‌లను రూపొందించడంలో దోహదపడిరది. ఇది ఒక ప్రత్యేక కారణాన్ని సూచిస్తుంది మరియు చాలా పెద్ద జనాభాలో నిర్లక్ష్యం చేయబడిన భాగానికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంది.

ఇన్ఫినిటీ రైడ్‌ గురించి:

ఎఎమ్‌ఎఫ్‌కు ప్రత్యేకమైన ఫండ్‌-రైజింగ్‌ ఈవెంట్‌, ఇన్ఫినిటీ రైడ్‌ ద్వారా నిధులను సేకరిస్తుంది మరియు వికలాంగుల జనాభాలో ప్రతిభను స్కౌట్‌ చేస్తుంది మరియు అట్టడుగు స్థాయి నుండి వారికి శిక్షణ ఇస్తుంది. సేకరించిన డబ్బుతో, ఇది కౌన్సెలింగ్‌ను కూడా అందిస్తుంది మరియు వారి క్రీడలో మెరుగ్గా ఉండటానికి లేదా వారికి సరిపోయే క్రీడను కనుగొనడంలో సహాయపడుతుంది. ఇది ఈ క్రీడాకారులకు అవసరమైన పరికరాలు, శిక్షణ మరియు నిధులను అందజేస్తుంది, అలాగే వారు తమ క్రీడలో ఎదగడానికి మరియు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు వారికి సహాయపడుతుంది. పౌర ప్రతిభతో పాటు, ఫౌండేషన్‌ యొక్క ప్రయత్నాలలో ప్రధాన భాగం దేశంలోని సెంట్రల్‌ ఆర్మ్డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బిఎస్‌ఎఫ్‌, సిఆర్‌పిఎఫ్‌ మరియు ఐటిబిపి) నుండి ప్రతిభను కనుగొనడం మరియు పెంపొందించడంపై నిర్దేశించబడిరది, ఇందులో అనేక మంది సైనికులు ఉన్నారు. సరిహద్దు వద్ద లేదా నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలలో ఉన్న దేశం మరియు ఇప్పుడు 2024 పారాలింపిక్స్‌కు సంభావ్య ప్రతిభావంతులుగా మారడానికి శిక్షణ పొందుతున్నారు.
మరింత సమాచారానికి దయ చేసి సంప్రదించండి: 9959154371 / 9963980259

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *