Hyderabad

టై సస్టెనేబిలిటీ సమ్మిట్ 2021కు వేదిక అయిన హైదరాబాద్

టై సస్టెనేబిలిటీ సమ్మిట్ 2021కు వేదిక అయిన హైదరాబాద్

 

భాగ్యనగరంలో మరో అతిపెద్ద గ్లోబల్ ఈవెంట్ కు వేదిక కానుంది. పర్యావరణ సమతుల్యత, సహజ వనరుల సంరక్షణపై ప్రపంచంలోనే అతిపెద్ద శిఖరాగ్ర సమావేశం 2021కు హైదరాబాద్ వేదిక అయినట్లు టై హైదరాబాద్ ఛాఫ్టర్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో అక్టోబర్ లో జరిగే టై సస్టెనేబిలిటీ సమ్మిట్ 2021 సమావేశానికి  ప్రపంచవ్యాప్తంగా ఉన్న 20 వేల మందికిపైగా పారిశ్రామిక వేత్తలు గ్లోబల్ థింక్ లీడర్స్ పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు .హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ లో నిర్వహించిన కర్టన్ రైజర్ ఈవెంట్ లో ఇజ్రాయిల్ రాయబారి క్టర్ రాన్ మల్కా, కోస్టారికా రాయబారి మిస్టర్ క్లాడియో అన్సోరెనా, అదానీ గ్రూప్ సీఈఓ సుదీప్తా భట్టాచార్య,  ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ , టై హైదరాబాద్ ఛాప్టర్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి, టై హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ సురేష్ రాజులు వెల్లడించారు .

టై సస్టేనేబిలిటీ సమ్మిట్ ఛైర్ పర్సన్, టై హైదరాబాద్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఈ సమావేశం నిర్వహణతో హైదరాబాద్ సస్టేనబిలిటీ రంగంలో స్టార్టప్ లకు గమ్యస్థానంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ గ్లోబల్ ఈవెంట్ ను టై హైదరాబాద్ హోస్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు .

 

టై హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ, సమాజం, పర్యావరణంసుస్థిరత అనే అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు టీఎస్ఎస్ 2021 వైస్ ప్రెసిడెంట్ సురేష్ రాజు తెలిపారు.ఈ సమావేశంలో దేశ ,విదేశాలకు చెందిన డెలిగేట్స్ పాల్గొంటారని… అయితే కరోనా నేపథ్యంలో కొంత మంది వర్చువల్ పద్దతిన ఈ సమ్మిట్ లో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు .

పర్యావరణ సమతుల్యతను కాపాడటం, సహజ వనరుల క్షీణతను నివారించడం అజెండాగా ఈ సమ్మిట్ నిర్వహించడం అభినందనీయమని ఐటీ సెక్టటరీ జయేష్ రంజన్ అన్నారు . తెలంగాణ ప్రభుత్వం సహజవనరుల రక్షణ, పర్యావరణాన్ని కాపాడేందుకు తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. ఇక హైదరాబాద్ లో అంతర్జాతీయ సమ్మిట్ జరిపేందుకు ముందుకు వచ్చిన టై హైదరాబాద్ సభ్యులను ఆయన అభినందించారు.

Ramesh

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

18 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

18 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

18 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

1 day ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

1 day ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

3 days ago