టై సస్టెనేబిలిటీ సమ్మిట్ 2021కు వేదిక అయిన హైదరాబాద్
భాగ్యనగరంలో మరో అతిపెద్ద గ్లోబల్ ఈవెంట్ కు వేదిక కానుంది. పర్యావరణ సమతుల్యత, సహజ వనరుల సంరక్షణపై ప్రపంచంలోనే అతిపెద్ద శిఖరాగ్ర సమావేశం 2021కు హైదరాబాద్ వేదిక అయినట్లు టై హైదరాబాద్ ఛాఫ్టర్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో అక్టోబర్ లో జరిగే టై సస్టెనేబిలిటీ సమ్మిట్ 2021 సమావేశానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 20 వేల మందికిపైగా పారిశ్రామిక వేత్తలు గ్లోబల్ థింక్ లీడర్స్ పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు .హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ లో నిర్వహించిన కర్టన్ రైజర్ ఈవెంట్ లో ఇజ్రాయిల్ రాయబారి క్టర్ రాన్ మల్కా, కోస్టారికా రాయబారి మిస్టర్ క్లాడియో అన్సోరెనా, అదానీ గ్రూప్ సీఈఓ సుదీప్తా భట్టాచార్య, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ , టై హైదరాబాద్ ఛాప్టర్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి, టై హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ సురేష్ రాజులు వెల్లడించారు .
టై సస్టేనేబిలిటీ సమ్మిట్ ఛైర్ పర్సన్, టై హైదరాబాద్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఈ సమావేశం నిర్వహణతో హైదరాబాద్ సస్టేనబిలిటీ రంగంలో స్టార్టప్ లకు గమ్యస్థానంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ గ్లోబల్ ఈవెంట్ ను టై హైదరాబాద్ హోస్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు .
టై హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ, సమాజం, పర్యావరణంసుస్థిరత అనే అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు టీఎస్ఎస్ 2021 వైస్ ప్రెసిడెంట్ సురేష్ రాజు తెలిపారు.ఈ సమావేశంలో దేశ ,విదేశాలకు చెందిన డెలిగేట్స్ పాల్గొంటారని… అయితే కరోనా నేపథ్యంలో కొంత మంది వర్చువల్ పద్దతిన ఈ సమ్మిట్ లో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు .
పర్యావరణ సమతుల్యతను కాపాడటం, సహజ వనరుల క్షీణతను నివారించడం అజెండాగా ఈ సమ్మిట్ నిర్వహించడం అభినందనీయమని ఐటీ సెక్టటరీ జయేష్ రంజన్ అన్నారు . తెలంగాణ ప్రభుత్వం సహజవనరుల రక్షణ, పర్యావరణాన్ని కాపాడేందుకు తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. ఇక హైదరాబాద్ లో అంతర్జాతీయ సమ్మిట్ జరిపేందుకు ముందుకు వచ్చిన టై హైదరాబాద్ సభ్యులను ఆయన అభినందించారు.