గీతం అధ్యాపకులకు భారీ ప్రాజెక్టులు, గ్రాంట్లు

Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో పనిచేస్తున్న అధ్యాపకులకు శాస్త్ర, సాంకేతిక పరిశోధనా మండలి (సెర్చ్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సెర్చ్ రీసెర్చ్ (ఐసీఎస్ఎస్ఆర్) నుంచి గణనీయమైన పరిశోధనా! గ్రాంట్లు మంజూర్నెట్టు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ని రసాయన శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శిర్పేందు ఘోష్, ‘జీవ’ పారతో ప్రోటీన్ల శక్రత నియంత్రిత పరస్పర చర్య పరమాణువు నిర్మాణం, సెల్యులార్ ధర్మంలో దాని బెవిత్యం ,స్పెక్ట్రోస్కోపిక్, మెక్రోస్కోపిక్ అధ్యయనం’ కోసం రూ.33 లక్షల గ్రాంటును సెర్చ్ నుంచి పొందినట్టు వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా, జీవ పొరలతో ప్రోటీన్ పరస్పర చర్యల వెనుక ఉన్న క్లిష్టమైన విధానాలను, సెల్యులార్ నితీరువాటి ప్రభావాన్ని పరిశోధించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.

రసాయన శాస్త్ర విభాగానికే చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నివేదిత సిక్టర్, ‘ఎలక్ట్రోకెమికల్ సీనో తగ్గింపు ప్రతిచర్య కోసం నూతన ఉత్ప్రేరకాల ఇంజనీరింగ్ చేయడానికి ఉపరితలం: సోరస్ ఎలక్ట్రోపై కలసికట్టు విధానాన్ని అర్థం చేసుకోవడం’ కోసం రూ.26. 410 లక్షల గ్రాంటును సెర్చ్ మంజూరు చేసిందన్నారు. కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అమరేంద్ర పొందేకు రూ.11.50 లక్షల గ్రాంలు ఐసీఎస్ఎస్ఆర్ ద్వారా మంజూరిందని ఆయన తెలిపారు. ‘తెలంగాణ, ఉత్తరప్రదేశలోని లింగ- క్లిష్ట జిల్లాలలో “బేటీ బచానో బేటీ పడావో పథకం ప్రభావంపై తులనాత్మక అంచనా’ పేరుతో ఈ పరిశోధన కొనసాగుతుందన్నారు.

గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెస్లోని పాలిటికల్ సెన్ట్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గుర్రం అశోకకు, ‘అట్టడుగు స్థాయి పాలనలో డిజిటల్ ఇండియా పాత్ర తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలలో పరిశోధనాత్మక అధ్యయనం’ పేరిట చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు నాలుగు లక్షల రూపాయల గ్రాంటును ఐసీఎస్ఎస్ఆర్ మంజూరు చేసినట్టు ప్రొఫెసర్ రావు వెల్లడించారు.ఈ పరిశోధనా గ్రాంట్లు వివిధ విభాగాలలో అత్యాధునిక పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో గీతం, హెదరాబాద్ నిబద్ధతను సృష్టీకరిస్తుందన్నారు. విశ్వవిద్యాలయం, దాని అధ్యాపక సభ్యుల విజయాలు, జ్ఞానాన్ని పెంపొందించడానికి, క్లిష్టమైన సామాజిక సమస్యలను పరిష్కరించడంలో వారి అంకితభావానికి తార్యాణమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *