స్పేస్ టెక్ ఇండస్ట్రీలో అపార అవకాశాలు: ఇస్రో శాస్త్రవేత్త

Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

అంతరిక్ష పరిశోధనలు విస్తరిస్తున్న కొద్దీ ఆ రంగంలో అవకాశాలు అపారంగా పెరుగుతున్నాయని, తగిన సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని అందిపుచ్చుకోవాలని ప్రఖ్యాత ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ శేషగిరిరావు వెల్లంకి సూచించారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘స్పేస్ టెక్ పరిశ్రమలో వినూత్న ధోరణులు’ అనే అంశంపె గురువారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. అంతరిక్ష సాంకేతిక పరిశ్రమలో వృద్ధికి విస్తారమైన పరిధి, సంభావ్యతల గురించి ఆయన విడమరచి చెప్పారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 20వ దశకం ప్రారంభంలో ‘న్యూ స్పేస్’ అనే పదం ఉద్భవించిందని, ఇది వాణిజ్య కార్యకలాపాలు, సాంప్రదాయ అంతరిక్ష కార్యకలాపాలు, ఆయా రంగాల బాధ్యతల నుంచి వేరు చేయడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. పేలోడ్లు / ఉపగ్రహాలు, లాంచర్లు/ల్యాండర్లు, స్పీస్ సెగ్మెంట్లలో నివాసం/రవాణాతో సహా స్పేస్ టెక్ పరిశ్రమలోని కీలకమైన ఆవిష్కరణ ప్రాంతాలను డాక్టర్ రావు ప్రస్తావించారు.భారతదేశ స్పేస్ టెక్ మార్కెట్ 2023 నుంచి 2030 వరకు సగటు వార్షిక వృద్ధి రేటు 26 శాతంగా ఉంటుందని, 77 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని ప్రొఫెసర్ శేషగిరి అంచనా వేశారు.

2022 నాటికి ఎనిమిది బిలియన్ డాలర్ల పెట్టుబడితో దాదాపు 204 స్పేస్ స్టార్టప్లు పనిచేస్తూ, గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నట్లు చెప్పారు. ఉపగ్రహ పరిశ్రమలో చిన్న ఉపగ్రహాలు, శాటిలెట్ ఐవోటీ, అడ్వాన్స్డ్ డ్ గ్రౌండ్ సిస్టమ్స్, కృత్రిము మేథ, స్పేస్ క్రాఫ్ట్ ప్రొపల్షన్ వంటి సాంకేతిక పోకడలు మరిన్ని స్టార్టప్ లను ఆకర్షిస్తుందని డాక్టర్ రావు చెప్పారు. అధునాతన ఉపగ్రహాలు, తదుపరి తరం ఉపగ్రహ సమాచార వ్యవస్థ, అంతరిక్ష పర్యాటకం, వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాలతో సహా భవిష్యత్తు ధోరణులు, అందివచ్చే అవకాశాలను ఆయన వివరించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న స్పేస్ టెక్ పరిశ్రమపై విలువెన అంతరృష్ణులను ఆయన అందించడమే గాక, ఆవిష్కరణలు, వాణిజ్య అవకాశాలను ఏకరువు పెట్టారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చి ఆకట్టుకున్నారు.తొలుత, ప్రొఫెసర్ సి.ఈశ్వరయ్య అతిథిని పరిచయం చేసి, అంతరిక్ష సాంకేతిక రంగానికి ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ జ్ఞాపికతో సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *