_అధిక సంఖ్యలో హాజరైన ముస్లిం సోదరులు, ప్రజా ప్రతినిధులు
మనవార్తలు ,పటాన్ చెరు:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో గంగా జమున తెహజీబ్ సంస్కృతి పరవడిల్లుతోందనీ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ అన్నారు. రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకుని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గ స్థాయి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హోం మంత్రి మహమూద్ అలీ తో పాటు ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని అన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అతిథులను ఎమ్మెల్యే జిఎంఆర్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
36 లక్షల రూపాయలతో గుమ్మటాలకు ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :…
మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత…
పటాన్ చెరులో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రామ్…
అతి త్వరలో 75 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రతి మున్సిపాలిటీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వండి..…
పటాన్ చెరులో ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : ఏసుక్రీస్తు బోధనలు…