పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీవోఎస్) ద్వారా ప్రభావితమైమెన వారిలో హార్మోన్ అసమతుల్యత కారణంగా పురుష హార్మోన్లు సాధారణం కంటే ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయని, దీని కారణంగా ఋతుక్రమం తప్పడం, బరువు పెరగడం, అధిక జుట్టు పెరుగుల, మొటిమలు, అండాశయ తిత్తులు, చర్మ సమస్మలకు దారితీస్తున్నట్టు సీనియర్ కల్సల్టెంట్, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి దువ్వూరు, ఎండీ (ఇంటర్నల్ మెడిసిన్) వెల్లడించారు.’జాతీయ బాలికా దినోత్సవం’ సందర్భంగా గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని బుధవారం ‘బియాండ్ ద ఎక్రోనిమ్స్: పీసీవోడీ-పీసీనోఎస్’ అనే అంశంపై ఆతిథ్య ఉపన్యాసం చేశారు. మహిళల్లో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, సిండ్రోమ్ల వ్యాప్తి, వాటి ప్రభావం గురించి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ లక్ష్యం.పీసీవోఎస్ ప్రారంభంలోనే రోగ నిర్ధారణ, నిర్వహణల ప్రాముఖ్యతను డాక్టర్ దువ్వూరు నొక్కిచెబుతూ, ఇది సంతానోత్పత్తి, శారీరక ఆరోగ్యం, గుండె ఆరోగ్యాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందన్నారు. ఆరోగ్యకరమెనై ఆహారం, శారీరక వ్యాయామం, తగిన ఔషధాలు తీసుకోవడంతో పాటు ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ సమస్యను తోటి స్నేహితుల, కుటుంబ సభ్యులు, లేదా వెద్యనిపుణులతో పంచుకుని, దానికి వీలయినంత త్వరగా తగ్గించుకునేందుకు ప్రయత్నించడం మంచిదని హితవు పలికారు.అనుభవజ్ఞుడి నుంచి మహిళారోగ్య సమాచారాన్ని తెలుసుకోవడానికి, అవగాహన పొందడానికి నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు సంధించిన పలు ప్రశ్నలకు ఆయన తగిన జవాబులిచ్చి ఆకట్టుకున్నారు. చివరగా, విద్యార్థులు వెద్య నిపుణుడికి జ్ఞాపికను ఇచ్చి సత్కరించారు.