ఆచార్య ఎం.గోనానాయక్ సత్కారం

Hyderabad politics Telangana

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :

హెచ్ సియు తెలుగు శాఖలో అధ్యాపకులుగా పనిచేస్తున్న ఆచార్య ఎం.గోనానాయక్ ను ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మరియు భాషాభివృద్ధి ప్రాధికారిక సంస్థ వారు ‘తెలుగు భాషా సేవ జీవిత సాఫల్య పురస్కారం’ అందించారు . ఈ సందర్భంగా తెలుగు శాఖ అధ్యాపకులు ఆచార్య ఎం.గోనానాయక్ తెలుగు శాఖ అధ్యక్షుల కార్యాలయంలో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య పిల్లలమర్రి రాములు, ఆచార్య పవన్ కుమార్, ఆచార్య డి. విజయలక్ష్మితదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *