Telangana

జిస్మత్ జైల్ మండి థీమ్ రెస్టారెంట్ ను ప్రారంభించిన _దక్షిణాది సినీ ముద్దుగుమ్మ హనీ రోస్

మనవార్తలు ,హైదరాబాద్:

భోజన ప్రియులుకు నోరూరించే వంటకాల రుచులను ఆతిధ్యం అందించేందుకు మదీనగూడలోని శ్రీ దుర్గా కాలనీ ప్రధాన రోడ్డులో గల ఏకెయం ధర్మరావు సిగ్నెచర్ లో ఏర్పాటైన “జిస్మత్ జైల్ మండి అండ్ థీమ్ రెస్టారెంట్” ను దక్షిణాది నటి హనీ రోస్ ప్రారంభించారు.ఈ సందర్భంలో మలయాళ ముద్దుగుమ్మ హనీ రోస్ మాట్లాడుతూ విభిన్న ఆహార రుచులకు హైదరాబాద్ కేరాఫ్ గా నిలుస్తుందన్నారు. బోజన ప్రియులకు విభిన్న రకాల వంటకాల రుచులను అందించేందుకు, జైల్ మరియు నవాబ్ థీమ్ ఇక్కడ ఎంతో విభిన్నంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా జిస్మత్ మండి నిర్వాహకులు, ప్రముఖ యూట్యూబర్ గౌతమి మాట్లాడుతూ ఈ మండిలో జైల్ మరియు నవాబ్ డిజైన్ థీమ్ ప్రత్యేకమని, ఖైదీల వేషదారణలో కారాగారం డైనింగ్ లో కూర్చునే ఆహార ప్రియులకు ఫుడ్ సర్వ్ చేస్తారన్నారు. విజయవాడ, గుంటూరు, వైజాగ్, నెల్లూరులో బ్రాంచీలు కలిగిన తమ జిస్మత్ మండి త్వరలో సన్ సిటీలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ప్రాంఛైజీ నిర్వహకులు దినేష్ మాట్లాడతూ నవాబ్ మరియు జైల్ థీమ్ తో ఏర్పాటైన ఈ మండి రెస్టారెంట్ లో ఛెఫ్ లు ప్రత్యేకమైన జూసి మటన్ మండి, అల్ఫాహం మండి మరియు అరబిక్ ఫిష్ వంటి అనేక రకాల వంటకాలను అందిస్తున్నామని వివరించారు. టాలీవుడ్ నటుడు ధర్మా, శ్రీని ఇన్ ఫ్రా యం.డి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

 

admin

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

6 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

8 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

1 day ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago