మగ్గబెట్టే మిక్చర్ ఎన్‌రైప్ ను ఆవిష్కరించిన హోంమంత్రి
– పండ్లను సహజసిద్ధంగా మగ్గబెట్టే మిక్చర్ ‘ఎన్‌రైప్’ ఆవిష్కరణ
– చైనా విషరసాయనాలను రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదన్న హోంమంత్రి
హైదరాబాద్:
సీజనల్ పండ్లను సహజసిద్ధంగా మగ్గబెట్టే మిక్చర్ ‘ఎన్‌రైప్’ ను రాష్ట్ర హోంమంత్రి మమమూద్ అలీ ఆవిష్కరించారు.
హైదరాబాద్ కొత్తపేటలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌లో హోంమంత్రి హమూద్ అలీ తో పాటు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీభాయి, టీఎస్ ఆగ్రోస్ ఎండీ కె.రాములు ఎన్ రైప్ ను ఆవిష్కరించారు.” చైనా విష రసాయనాలతో మన మామిడి పండ్లు మాగబెట్టడం ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తోందని సేంద్రియ పద్దతుల్లోనే మామిడి పండ్లను మాగబెట్టాలన్నారు.
చైనా విషరసాయనాలను రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదన్నారు.. అందుకే తెలంగాణ ప్రభుత్వం సేంద్రియ పద్దతుల్లో పండ్లను మాగబెట్టే ఎన్ రైప్ మిక్చర్‌కు అనుమతి ఇచ్చిందన్నారు. ఇలాంటి ఎన్ రైప్‌ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని మహుమూద్ అలీ అన్నారు. ఎన్ రైప్ వంటి సేంద్రియ పద్దతుల్లో మామిడి పండ్లను మాగబెట్టే మిక్చర్ తయారు చేయడం దేశంలోనే ఇదే ప్రథమం స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇలాంటి ఉత్పత్తులను మనం ప్రోత్సహించాలన్నారు. అంతే కాకుండా ఈ ఎన్ రైప్ మిక్చర్‌ను సేంద్రీయం అని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ధ్రువీకరించడం సంతోషదాయకమని ప్రవీణ్ కుమార్ కితాబిచ్చారు.