వసంత నవరాత్రుల పూర్ణహుతి హోమం
చిట్కూల్ లో నీలం మధు ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా కార్యక్రమం..
విశేష మహా యజ్ఞం
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఆధ్వర్యంలో చిట్కూల్ లో వసంత నవరాత్రుల పూర్ణహుతి హోమాన్ని వేద పండితులు శ్రీరామనవమి సందర్భంగా జరిపారు .వసంత నవరాత్రుల పూర్ణహుతి హోమంలో ఎంపీ అభ్యర్థి నీలం మధు దంపతులు బుధవారం సతీసమేతంగా పాల్గొన్నారు. లోకంలో ఉండే జనులు సుభిక్షంగా ఉండేందుకు నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో యజ్ఞం జరిపించారు. ఇందులో భాగంగా ఉగాది నుంచి మొదలు 11 రోజులు శ్రీరామనవమి వరకు వేద పండితులు పదకొండు రోజులుగా జరుగుతున్న మహా యజ్ఞ కార్యక్రమం బుధవారం లక్ష పుష్పార్చనతో ముగిసింది. ప్రజలు సుభిక్షంగా ఉండి, వారికి సిరి సంపదలు సంపదలు కలుగాలని ప్రత్యేకంగా హోమం జరిపించామని నీలం మధు తెలిపారు. హోమంలో గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

