కృష్ణమ్మ ఒడిలో పుణ్యస్నానాలు.. కార్తీక దీపదానాలు

Andhra Pradesh Districts politics

కర్నూల్:

శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున మహా పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతున్నది. పరమ శివుడి దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల  నుంచేకాక ఉత్తర, దక్షిణాది యాత్రికులు ఆదివారం సాయంత్రానికి అధిక సంఖ్యలో క్షేత్రానికి చేరుకున్నారు. భక్తుల కు అలంకార దర్శనాలు క ల్పించడంలో ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ ఈవోలకు   అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తెల్లవారుజుమున కృష్ణానదిలో పుణ్య స్నానాలు చేసుకుని కృష్ణమ్మకు పసుపు, కుంకుమ సారెలు ఇచ్చి కార్తీక దీపదానాలు చేశారు.

స్నానాల ఘాట్‌ వద్ద ప్రమాదాలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ నర్సింహారెడ్డి తెలిపారు. చిన్నారులపై తల్లిదండ్రులు శ్రద్ధ్ద వహించాలని కోరారు. అదేవిధంగా కార్తీక దీపాలనువెలిగించుకునేందుకు భక్తులకు వీలుగా ఆలయ ఉత్తర మాఢవీధిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఏఈవో హరిదాసు తెలిపారు. విద్యుద్దీపకాంతులతో అలరారుతున్న ఆలయ శోభను వీక్షిసూ భక్తులు ఆధ్యాత్మిక ఆనంద పరవశులవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *