పరిమళించిన మానవత్వం ….
పటాన్ చెరు:
72 ఏళ్లు వృద్ధురాలు రామచంద్రాపురంలో ఓ ఆశ్రమంలో ఉంటుంది . వృదురాలికి ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆశ్ర మం నిర్వాహకులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి కోవిడ్ టెస్టు చేయించుకొని , నెగిటివ్ వస్తే ఆశ్ర మానికి రావాలని , పాజిటీవ్ వస్తే రావొద్దని చెప్పి పంపారు.
దీంతో ఆమె పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి కోవిడ్ టెస్టు చేయించుకోవడానికి శనివారం రాత్రి 9 గంటలకు వచ్చి కుర్చీలో కూర్చుంది . ఆపై ఆలోచిస్తుంది , ఈమెను గమ నించిన కోవిడ్ టెస్టుల నిర్వాహకుడు మనోహర్ వివరాలు అడిగి తెలుసుకున్నాడు . అనంతరం ఆమెకు కోవిడ్ టెస్టు నిర్వహించి నెగిటివ్ రావ డంతో రిపోర్ట్ తీసుకున్నారు . అనంతరం ఎండీ ఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు మధుకు సమాచారం ఇచ్చారు . అతడు వచ్చి వృద్ధురాలిని తీసుకొని రామచంద్రాపురం ఆశ్రమంలో వదిలారు . దీం తో ఆ వృద్ధురాలు మనోహర్ , మధులకు కృతజ్ఞ తలు తెలిపింది.
ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ… ఎం డి ఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అనాధ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని, ఫౌండేషన్ ఎప్పుడు ఆపదలో ఉన్న వారికి సాయం చేయడంలో ముందుంటోంది అని తెలిపారు.