మనవార్తలు ,పటాన్ చెరు;
భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఇస్నాపూర్ లోని తన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన పటాన్చెరు మాజీ జెడ్పిటిసి బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ ఈ సందర్బంగా మాట్లాడుతూ సమైఖ్య భారత వని కోసం గాను ప్రాణాలర్పించిన మహనీయుడని ,శ్యామ ప్రసాద్ ముఖర్జీ కన్న కలలను మోడీ సాకారం చేస్తాడని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఒక గొప్ప దేశ భక్తుడని 317 జీవోను రద్దు చేయించి ముఖర్జీ ఆశయాన్ని నెరవేర్చిన ఘనత మోడిదని అని గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఈ కార్యక్రమంలో ధన్ రాజ్, నరెందర్, సాయి కుమార్, షకీల్, దుర్గా తదితరులు పాల్గొన్నారు.