టిఆర్ఎస్ శ్రేణుల హర్షం కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

Hyderabad politics Telangana

పటాన్ చెరు

నియోజకవర్గ కేంద్రమైన పటాన్ చెరు పట్టణంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. ఆదివారం సాయంత్రం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బాణసంచా కాల్చి, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ చరిత్రలోనే ఇది ఒక చారిత్రక నిర్ణయం అని అన్నారు. ఆస్పత్రి ఏర్పాటుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పట్టువదలని విక్రమార్కుడిలా చేసిన కృషి ఫలించిందని హర్షం వ్యక్తం చేశారు.

మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో అత్యాధునిక వసతులతో కూడిన 270 పడకల ఆస్పత్రి ఏర్పాటు ప్రజలకు ఆధునిక వైద్యం లభిస్తుందని అన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *