మన వార్తలు, శేరిలింగంపల్లి :
ఎన్నో కొత్త కొత్త మోడల్ కార్లకు పెరు గాంచిన హార్ష్య టాయోట కంపెనీ ఈ సమ్మర్ లో న్యూ కూల్ టయోట గ్లాoజ కార్ ను శనివారం రోజు ప్రముఖ సినీ నటుడు నవదీప్ కొత్తగూడ, కొండాపూర్ లోని టయోట షో రూమ్ లో మార్కెట్ లోకి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి మంచి అధునాతనమైన ఫ్యూచర్ లతో తీర్చిదిద్దబడిన ఈ కారు మంచి మైలేజీ ఇస్తుందని అన్నారు. లేటెస్ట్ మెడల్ ఈ కార్లో 360 కెమెరా, 6 ఎయిర్ బ్యాగులు, హెడ్ ఆఫ్ డిస్ ప్లే, జియో ఫెన్స్ అలర్ట్, న్యూ డిజైన్ అల్లో వీల్స్, ఆటోహెడ్ ల్యాoప్స్, డే టైం రన్నింగ్ ల్యాoప్స్. అన్ని సైడ్ ల యూ వి ప్రొటెక్షన్ సన్ వంటి సదుపాయాలు కలవని కంపెనీ వారు తెలిపారు. కస్టమర్ల ఆదరాభిమానాలు పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హర్షా గ్రూప్ సి ఈ ఓ సురేష్ భార్గవ్, వైస్ ప్రేజిడెంట్ మీర్జా అలీ ఖాన్, షో రూమ్ మేనేజర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.