పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మరో వసంతం నిండిన యాదమ్మ మహిపాల్ రెడ్డి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు వెలువేత్తాయి, ఈ ప్రత్యేక రోజు వారి జీవితంలో మరుపురాని రోజులలో ఒకటిగా ఉండాలని వివాహ వార్షికోత్సవ శుభకాంక్షలు మైనారిటీ నాయకుడు మహమ్మద్ షకీల్ లడ్డు తెలిపారు, ఎమ్మెల్యే నివాసంలో పుణ్య దంపతులకు పూలమాలతో సన్మానించి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు . ఈ సందర్భంగా షకీల్ లడ్డు మాట్లాడుతూ అవధులు లేని ప్రేమానురాగాలతో వారి జీవితం ఆనందంగా సాగిపోవాలని కోరుకున్నట్టు తెలిపారు, వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో కలకాలం సాగాలని ఆ దేవుడిని మనసారా ప్రార్థిస్తున్నానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మహమూద్, జీవన్, ఇషాక్, కిరణ్, అమీర్, అర్జున్ చిన్న, మారుతి, పీజీ కిరణ్, ప్రశాంత్, ఖాదర్, తదితరులు పాల్గొన్నారు.