పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (137వ జయంతిని పురస్కరించుకుని గురువారం హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ‘ఉపాధ్యాయ దినోత్సవాన్ని’ సగర్వంగా జరుపుకుంది. యువతను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కీలక పాత్రను, దేశ నిర్మాణానికి వారి అమూల్యమెన సహకారాన్ని గుర్తించడానికి ఈ ప్రత్యేక రోజు అంకితం చేయబడింది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గీతం విద్యార్థులు, అధ్యాపకులంతా హాజరు కావడంతో సభ ప్రారంభమైంది. ఆయా విద్యార్థులు వారి వారి అధ్యాపకుల నిరంతర కృషి, అంకితభావాలను గుర్తిస్తూ శుభాకాంక్షలు తెలియజేసి, వారి ఆశీర్వాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు సహా విశిష్ట ప్రముఖులు, ఉపాధ్యాయ వృత్తి యొక్క ప్రాముఖ్యతను ఎత్తిచూపుతూ స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేశారు. జ్ఞాన ప్రకాశానికి ప్రతీకగా, జ్యోతి ప్రజ్వలనతో ఈ వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు.
తమ విభిన్న ప్రతిభను ప్రదర్శించే పలు సాంస్కృతిక కార్యక్రమాలను కృతజ్ఞతా భావంతో విద్యార్థులు. నిర్వహించారు. సంప్రదాయ, పాశ్చాత్య నృత్యాలతో పాటు కచేరీలను ప్రదర్శించి, వాటిని తమ అధ్యాపకులకు అంకితం చేశారు. హృదయాలను హత్తుకునే ఒక వీడియోను కూడా ఈ సందర్భంగా ప్రదర్శించి, అందులో తను అధ్యాపకులకు హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేశారు. అంతేకాకుండా, అధ్యాపకుల కోసం కొన్ని ప్రత్యేక క్రీడాపోటీలను కూడా నిర్వహించి, వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు.ప్రొఫెసర్ కె.మారుతీప్రసాద్ కు ఉత్తమ ఉపాధ్యాయుడు, పద్మలకు ఉత్తమ అధ్యాపకురాలు అవార్డులిచ్చి సత్కరించారు. ఈ రోజును చిరస్మరణీయంగా మార్చడానికి సహకరించిన వారందరికీ విద్యార్థి సమన్వయకర్త కృ తజ్ఞతలు తెలియజేశారు. చివరగా, హాజరైన వారందరికీ ఫలహారంతో పాటు, తేనేటి విందును ఏర్పాటు చేశారు.