మనవార్తలు ,పటాన్చెరు
కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆంగ్ల నూతన సంవత్సరం పురస్కరించుకొని పటాన్చెరు నియోజకవర్గం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో, జిల్లా మంత్రుల సలహాలు సూచనలతో, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళుతున్నట్లు తెలిపారు. నూతన సంవత్సరం వేడుకలు కరోనా నిబంధనల ప్రకారం జరుపుకోవాలని కోరుతున్నామని, అందరూ మాస్క్ లు ధరించిడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు. 2021 వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, 2022 లోకి అడుగుపెడుతున్న ప్రజలకు శుభం కలగాలని కోరుతున్నామని తెలిపారు.