మనవార్తలు ,రామచంద్రపురం
టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ 46వ జన్మదినం పురస్కరించుకొని రామచంద్రపురం 112 డివిజన్లో ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా చెట్లు నాటడంఅనంతరం ఏకే ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణను టెక్నాలజీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేసిన గొప్ప వ్యక్తి మంత్రి కేటీఆర్ అని, కేటీఆర్ కాలుకు గాయం కావడంతో త్వరగా కోలుకోవాలని అల్లాను కోరుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు షేక్ అబ్దుల్ గఫార్, సలీం భాయ్, అబ్దుల్ ఖాసీం, ముబీన్ అంజద్ తదితరులు పాల్గొన్నారు.
