మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ వాస్తవ్యులు ప్రముఖ సంఘ సేవకులు ,యువ వ్యాపార వేత్త రాచమల్ల భాస్కర్ గౌడ్ పుట్టినరోజు వేడుకలను మియాపూర్ యూత్ సభ్యులు, వివిధ పార్టీ నాయకుల సమక్షంలో మియాపూర్ ఆర్.బి.ఆర్ అపార్ట్ మెంట్స్ లోని రాచమల్ల భాస్కర్ గౌడ్ కార్యలయంలో ఘనంగా సెలబ్రేట్ చేసారు. మొదటగా శాలువా తో సత్కరించి ఆయనచే కేక్ కట్ చేయించి అనంతరం వారికి జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ 108 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తాండ్ర రాంచందర్ గౌడ్, బండారు మహేందర్ ముధిరాజ్, యెల్లంకి శ్రీనివాస్ గౌడ్, మన్నె సురేష్ ముధిరాజ్, బండారు శ్రీనివాస్ ముధిరాజ్, యలమంచి ఉదయ్ కిరణ్, మన్నె విజయ్ ముధిరాజ్, దోర్నాల రవికుమార్ గౌడ్, నర్సింహ,చిరంజీవి ముధిరాజ్,సతీష్ లతో పాటు పలు కాలనీల పెద్దలు భాస్కర్ గౌడ్ ను కలిసి ఆశీర్వాదాలు అందించారు. యువకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
