మనవార్తలు ,పటాన్ చెరు:
పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు ,హనుమాన్ దీక్ష సేవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హనుమాన్ జయంతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు .అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు, శ్రీ వీరాంజనేయ స్వామి మందిరం లో నేడు హనుమాన్ జయంతి పురస్కరించుకొని హనుమాన్ దీక్ష సేవాసమితి ఆధ్వర్యంలో 54 అడుగుల వీరా ఆంజనేయస్వామి ఆలయంలో దగ్గర జెండా ఆవిష్కరణ చేసి శ్రీ ఆంజనేయ స్వామి మాల వేసుకున్న గురు స్వాములు సుమారు 1989 సంవత్సరం నుండి వారి ఆధ్వర్యంలో ఆంజనేయస్వామికి సింధూరం,పాలాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాము అని అన్నారు గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్య లో పాల్గొని శ్రీ రామభక్త ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపిటిసి హరి ప్రసాద్ రెడ్డి, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ,మరియు హనుమాన్ దీక్ష సేవా సమితి స్వాములు, మాజీ ఎంపీపీ మండల తెరాస పార్టీ అధ్యక్షులు గాయత్రి పాండు, గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నార.