మన వార్తలు శేరిలింగంపల్లి :
మాదాపూర్ లో గల శిల్పారామం లో భారత ప్రభుత్వం , మినిస్ట్రీ అఫ్ టెక్స్ టైల్స్, ఆఫీస్ అఫ్ ది డెవలప్ మెంట్ అఫ్ కమీషనర్ హ్యాండ్లూమ్స్ న్యూ ఢిల్లీ, వీవెర్స్ సర్వీసింగ్ సెంటర్ హైదరాబాద్ వారి సంయుక్త నిర్వహిస్తున్న మేళా నుఅడిషనల్ డెవలప్ మెంట్ కమిషనర్ హ్యాండ్లూమ్స్ వివేక్ కుమార్ బజ్ పాయ్, డైరెక్టర్ మరియు రీజినల్ ఎన్ఫోర్స్ మెంట్ ఆఫీసర్ డాక్టర్ అరుణ్ కుమార్ లు ప్రారంభించారు. నేటి నుండి ఏప్రిల్ 24 వరకు నెల రోజుల పాటు చేనేత కళాకారులను ప్రోత్సహించుటకు మేక్ ఇన్ ఇండియా మరియు మై హ్యాండ్లూమ్ మై ప్రైడ్ అనే అంశం మీద డిస్ట్రిక్ట్ హ్యాండ్లూమ్ ఎక్స్ పో 2022 పేరుతో మేళా నిర్వహిస్తున్నట్లు శిల్పారామం అధికారులు తెలిపారు. .
ఈ మేళ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుండి దాదాపు 60 మంది అర్హులైన చేనేత కళాకారులు విచ్చేస్తున్నారు. పోచంపల్లి, గద్వాల్, గొల్లభామ, ధర్మవరం, మంగళగిరి పట్టు మరియు కాటన్ చీరలు , బేడీషీట్ , భాగల్పూరి సారీస్,బనారస్, కోట, మహేశ్వరి, చందేరి, కొస చీరలు సందర్శకులకు అందుబాటులో ఉంటాయి. ఉదయం 10 .30 నుండి రాత్రి 8 గంటల వరకు చేనేత కళాకారులు అందుబాటులో ఉంటారని తెలిపారు.
సందర్శకుల ఆహ్లాదం కొరకు ప్రతి రోజు సాయంత్రం శిల్పారామం యాoపీ థియేటర్ లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు.శుక్రవారం రోజు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీ సాయి ఆర్ట్స్ అకాడమీ శిష్యులు కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. మూషిక వాహన, తారంగం, భామాకలాపం, దేవా దేవమ్, గరుడ గమన, జై జనార్ధన, ముద్దుగారేయ్ యశోద, మహాగణపతిమ్ , ఏకదంతాయ, హనుమాన్ చాలీసా మొదలైన అంశాలను ప్రదర్శించారు. ముసునూరి ఇందిరా శిష్యులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య కుండలు మరియు దీపాలపై ప్రదర్శించిన అంశం ఎంతగానో అలరించింది. ప్రముఖ నటి సుధాచంద్రన్ నృత్యకళాకారులకి జ్ఞాపికలు ఇచ్చి సత్కరించారు.