గీతంలో ఉత్సహభరితంగా హలోవీన్ వేడుక

Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదు మరో వినూత్న కార్యక్రమానికి వేదికైంది. గీతం క్యాంపస్ లైఫ్ లోని విద్యార్థి విభాగాలు- వాస్ట్రోనోవా, అనిమే మాంగా, జీ-స్టూడియో, అర్కా (ఏఆర్ సీఏ)లు సంయుక్తంగా శుక్రవారం ప్రాంగణంలో కళ, ఫ్యాషన్, సంగీతం, మిస్టరీలను మిళితం చేసిన ఒక ప్రత్యేకమైన హలోవీన్ వేడుక ‘షాడోస్ అండ్ సిల్హౌట్స్’ను ఉత్సాహభరింతంగా నిర్వహించాయి.

ఈ కార్యక్రమం విశ్వవిద్యాలయాన్ని ఊహ, వినోదాల మేలు కలయికగా నిలిచింది. విద్యార్థులు తమ సృజనాత్మకతను ఆకర్షణీయమైన కార్యకలాపాల ద్వారా ప్రదర్శించారు. థ్రిల్లింగ్ మర్డర్ మిస్టరీ, మనస్సును కదిలించే ఎస్కేప్ రూమ్ సవాళ్లు, ప్రతి ఒక్కరినీ ఉర్రూతలూగించే ఉల్లాసమైన డీజే కార్యక్రమం, ప్రాంగణాన్ని మినీ కామిక్-కాన్ గా మార్చిన అద్భుతమైన కాస్ ప్లే కవాతుల మేళవింపుగా దీనిని రూపొందించారు. పండుగ స్ఫూర్తికి అదనంగా ఒరిగామి కార్యశాల, కళ్ళు మిరిమిట్లుగొలిపేలా సాగిన ర్యాంప్-వాక్, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

విద్యార్థులు తమ స్నేహితులతో జట్టు కట్టడం, కొత్త అనుభవాలను అన్వేషించడం, చిరస్మరణీయ క్షణాలను మధుర జ్జాపకాలుగా మలచుకోవడంతో ప్రాంగణంలోని ప్రతి మూల సందడిగా మారింది. గీతం విద్యార్థి జీవితంలోని నిజమైన స్ఫూర్తితో పాటు సమ్మిళిత, సృజనాత్మక వ్యక్తీకరణతో నిండిన ఉత్సాహం, స్నేహాలను ప్రతిబింబించాయి.

ఈ యేడాది అత్యంత ఉత్తేజకరమైన, చిరస్మరణీయమైన వేడుకలలో ఒకటిగా ఇది నిలిచిపోయిందని అందులో పాల్గొన్న విద్యార్థులు పలువురు అభిప్రాయపడ్డారు. గీతం కళాత్మక ప్రతిభను, యువతలో ఆనందాన్ని ఎలా పెంచుతుందో అందంగా చూపింది. మొత్తంగా ఈ వేడుక ప్రాంగణమంతటా ఉత్సాహభరితమైన ప్రకంపనలతో నిండిపోయేలా చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *