శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ లో గల గుల్ మోహర్ పార్క్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘం నూతన కార్యవర్గాన్ని 18 వ సారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సునీల్ సింగ్, బషీరుద్దీన్ అహ్మద్ లు ఎన్నికల అధికారులుగా వ్యవహారించి నూతన కమిటీని ప్రకటించారు. నూతన అధ్యక్షుడిగా షేక్ ఖాసీం, ఉపాధ్యక్షులుగా మోహన్ రావు, రఘువరన్, సతీష్, టి.వి.రావు లు, ప్రధాన కార్యదర్శి గా నిరంజన్ రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా శేఖర్ రావు, విశ్వనాథం,వెంకటేశ్వర్లు,నాగన్న, విల్సన్ లను ప్రకటించారు. సంయుక్త కార్యదర్శులుగా ఆనంద్ కుమార్, పెంటోజి, యూసుఫుద్దీన్, వెంకటేశ్వర్ రావు, కేశవులు, వెంకటేశ్వర్లు, కల్చరర్ సెక్రెటరీ గా శేషసాయి, కోశాధికారి గా కిషోర్ బాబు, జాయింట్ ట్రెజరర్ గా దుర్గాప్రసాద్ లను ఎన్నుకోగా, ఎగ్జ్ క్యూటివ్ మెంబర్స్ గా చలమారెడ్డి, మాధవ రావు, ఆరీఫ్ఆలీ,అశోక్,అమూల్ కుమార్, తరాసింగ్ నాయక్, అలీఖాన్, చంద్రశేఖర్, రవికుమార్ రాజ్, విశాల్, బీరేంద్ర ఒరన్,చంద్రయ్య, శ్రీనివాస్, అంజయ్య, వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు.