కూచిపూడి నృత్యానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్
మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :
కలలు మానవ జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయన్నారు భారత్ ఆర్ట్స్ అకాడమీ ప్రతినిధి లలిత. 4000 మందికి పైగా కళాకారులతో నిర్వహించిన కూచిపూడి ప్రదర్శనకు గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు.కూచిపూడి నాట్యం ప్రదర్శన గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రధానోత్సవం కార్యక్రమం ఉషోదయ కాలనీ కమిటీ హాల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని కళాకారులకు అవార్డులను అందజేశారు.2023 డిసెంబర్ 24న గచ్చిబౌలిలో నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డు కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న కళాకారులకు ప్రతినిధులు శనివారం అవార్డులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమం కూచిపూడి నృత్య గురువు శ్వేత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ విజయ నాట్య నికేతన్ ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.