పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ‘లెఫ్ట్ స్కిల్స్ – క్యాంపస్ టు కెరీర్ ట్రాన్సిషన్’ అనే అంశంపై మంగళవారం ఆతిథ్య ఉపన్యాసం నిర్వహించారు. నైపుణ్య సంస్కృతి వ్యవస్థాపకుడు, ముఖ్యకార్యనిర్వహణాధికారి సుబ్బారావు ముక్కవిల్లి మాట్లాడుతూ, విజయవంతమైన ప్రయాణంలో సాఫ్ట్ స్కిల్స్ ప్రాముఖ్యత, జీవితం ప్రాథమిక ఉద్దేశం వంటి వాటిని వివరించారు. విజయాన్ని చేరుకోవడానికి గ్రోత్ ఎనేబుల్స్ అవసరాన్ని కూడా ఆయన నొక్కిచెప్పారు. విజయవంతమైన జీవితాన్ని గడపడానికి మన తెలివితేటలు, ఎమోషనల్ కోషెంట్, స్కిల్ కోషెంట్, డిజిటల్, డేటా కోషెంట్లను మెరుగుపరచుకోవాల్సిన అవసరాన్ని ఆయన పునరుద్ఘాటించారు. అనంతరం విద్యార్థులు సంధించిన పలు ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు.తొలుత స్కూల్ ఆఫ్ ఫార్మసీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.శ్రావ్య అతిథిని స్వాగతించగా, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ అతిథిని సత్కరించి, వందన సమర్పణ చేశారు.


