మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత
కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే జిఎంఆర్..
అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని సీతారామపురం కాలనీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దెందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఇటీవల కాలనీలో తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాలనీ ప్రజలు ఎమ్మెల్యే జిఎంఆర్ కు విజ్ఞాపన పత్రం అందించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం బల్దియ అధికారులతో కలసి కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో సీతారామపురం కాలనీ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రధానంగా సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, వీధి దీపాలు, పార్కుల అభివృద్ధికి వెంటనే చర్యలు చేపట్టాలని డిప్యూటీ కమిషనర్ సురేష్ ను ఆదేశించారు. పైన పేర్కొన్న అభివృద్ధి పనులన్నింటినీ నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. లో వోల్టేజి సమస్య ఎదురు కాకుండా వెంటనే నూతన ట్రాన్సఫార్మర్ర్ల బిగించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములైనప్పుడే దానికి సార్థకత చేకూరూతుందని తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏర్పాటు అవుతున్న కాలనీలలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బల్దియా అధికారులు, కాలనీ సంక్షేమ సంఘం, ప్రతినిధులు కాలనీవాసులు పాల్గొన్నారు.